కాకతీయ, నర్సింహులపేట : నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన రిపోర్టర్ కోల యాకయ్య తల్లి కోల మల్లమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నలభై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నెలకుర్తి నరసింహారెడ్డి, నెలకుర్తి సత్తిరెడ్డి, జంపాల బిక్షమయ్య, జంపాల వెంకన్న, కసిరెడ్డి లింగారెడ్డి, పోశాల శ్రీనివాస్, రావుల శ్రీనివాస్, వీరబోయిన రమేష్, సురేష్, జాఫర్, చందు వినయ్, శ్రీశైలం, రాజేష్, వెంకట్ రెడ్డి, కేశవరెడ్డి,క లవల వెంకన్న, లచ్చిరెడ్డి, శేషయ్య, మందుల సుధాకర్ పరుశురాములు, ప్రసాద్, శివరాత్రి అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.


