కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. సెప్టెంబర్ 21 ఆదివారం బంగారం, వెండి రేట్లు దేశంలోని అన్ని నగరాల్లోనూ పెరిగాయి. హైదరాబాద్, ముంబై మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే రూ.810 పెరిగి రూ.1,12,150కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,800కి పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,45,000 వద్దకు చేరింది. ఇది సెప్టెంబర్ 20తో పోల్చితే దాదాపు 2శాతం పెరుగుదల నమోదు చేసింది.
నగరాల వారీగా బంగారం ధరలు:
ఢిల్లీ: 24 క్యారెట్ 10 గ్రాములు – రూ.1,12,300
చెన్నై: రూ.1,12,260
కోల్‌కతా, పూణే: రూ.1,12,150
బెంగళూరు, వడోదర: రూ.1,12,150
వెండి ధరలు:
హైదరాబాద్, చెన్నై, కేరళ: కిలో – రూ.1,45,000
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణే, వడోదర: రూ.1,35,000
బెంగళూరు: రూ.1,33,600


