కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సప్తగిరి కాలనీలో 6–10వ తరగతి విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన అధ్యయన పుస్తకాలను ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు అందించారు.
ఈ సందర్భంగా ఆయన శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణ, వినయం, విధేయతతో మాణిక్యాలలా వెలుగొందుతారని, పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదని అన్నారు. ఫీల్డ్ ట్రిప్‌లకు ఉచిత బస్సులు, పదవ తరగతిలో 10 జిపిఏ 570 మార్కుల పైగా సాధించిన విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందిస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ అర్బన్ మండల విద్యాధికారి పుప్పాల కృష్ణగోపాల్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం సాధ్యమని, భాగస్వామ్యాలు కొనసాగాలని సూచించారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


