కాకతీయ, నర్సింహులపేట : మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప కుటీర నిర్మాణాన్ని శనివారం ది ఇందిరాగాంధీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సంకూరి జయప్రకాష్ , సీనియర్ పాత్రికేయులు పగిడిమర్రి సూర్యనారాయణలు పరిశీలించారు.
అనంతరం జయ ప్రకాష్ కుటీర నిర్మాణానికి ఒక లక్ష ఎనిమిది వేలు, మండలి కాలంలో అయ్యప్ప మాల దారులకు 41 రోజులకు నిత్య అన్నదానానికి ఒక లక్ష 116 రూపాయలు, సూర్యనారాయణ రూ.75 వేల 116 లు చెక్కుల రూపంలో గ్రామ నివాసి ఎనగాండ్ల క్రిష్ణారెడ్డి సమక్షంలో అయ్యప్ప భక్తమండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప కుటీర నిర్మాణానికి సహకరించిన దాతలకు అయ్యప్ప మాలధారులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


