కాకతీయ, నూగూరు వెంకటాపురం : భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం మండలం కొండా పురం గ్రామానికి చెందిన చిలుకూరి రామారావు మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వారికి మనోధైర్యాన్ని ఇచ్చి మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు , యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


