కాకతీయ, పెద్ద వంగర : సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అన్నారు. శనివారం మండలంలోని కేజీ బివి పాఠశాలలో చలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు అందించాలన్నారు.
అదనపు పని భారంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్న సిబ్బందికి పీఎఫ్ ఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేజీ బివిల్లో పనిచేస్తున్న సిబ్బంది హాజరై సెప్టెంబర్ 22 నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసీఐ తొర్రూర్ ఏరియా కమిటీ అధ్యక్షుడు ఎండీ షరీఫ్ సిబ్బంది విజయలక్ష్మి, మమత, పద్మ, మహేశ్వరీ, హేమలత, మౌనిక, జ్యోతి, సుజాత, నాగలక్ష్మి, నవత, సుమలత తదితరులు పాల్గొన్నారు.


