విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం
కగార్ ఆపరేషన్‌ను విఫలం చేద్దాం
మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
కేంద్ర కమిటీ పేరుతో వెంకటాపురంలో వెలిసిన కరపత్రాలు
కాకతీయ, నూగూరు వెంకటాపురం : ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం పాత్ర పురం గ్రామ శివారులో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. సీపీఐ మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. పార్టీని, పీఎల్‌జీఏను ఐక్య సంఘాలను విప్లవోద్యమాలను కాపాడుకుందామని కరపత్రాల్లో పేర్కొంది. కగార్ ఆపరేషన్‌ను విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గ పోరాటంలో గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దాం..శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని పేర్కొంది. విప్లమోద్యమ వెనుకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాం పార్టీ శ్రేణులకు పీఎల్‌జీఏ బలగాలకు విప్లవ ప్రజా నిర్మాణాలకు ప్రజానీకానికి సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందంటూ కర్రపత్రాల్లో పేర్కొంది.


