కాకతీయ, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కోకాపేట లో గురువారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన భర్తను స్థానికులు రక్తపు మడుగులో పడి ఉండగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. మృత దంపతులు అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


