కాకతీయ, నేషనల్ డెస్క్: రాజస్థాన్ లోని అజ్ మేర్ లో ఓ కసాయి తల్లి నిద్రిస్తున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాట విని సరస్సులో పడేసిన ఘటన కలకలం రేపింది. నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక డెడ్ బాడీ కనిపించింది. బయటకు తీసిన క్రిస్టియన్ గంజ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాప తల్లి అంజలీసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. భర్తను వదిలేసిన అంజలి రెస్టారెంటులో పనిచేసే అఖిలేష్ తో కలిసి జీవిస్తోంది. ఇద్దరి మధ్య సఖ్యతకు కుమార్తె అడ్డుగా ఉందని ప్రియుడు చెప్పడంతో రాత్రివేళ పాప వేలు పట్టుకుని సరస్సు చుట్టూ తిప్పింది. కబురు చెప్పిన అంజలి చిన్నారి నిద్రించిన తర్వాత అఘాత్యానికి పాల్పడింది.


