కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు దేశీరాం అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి పథకానికి, సంబంధించిన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ పురుషోత్తం ముఖ్య అతిదిగా పాల్గొని , జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీరాం ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా మాస్టర్ ట్రైనర్స్, బ్లాక్ లెవల్ ట్రైనర్స్ లకు ఆది కర్మ యోగి పథకంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంక్షేమ అధికారి మాట్లాడుతూ ,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గిరిజన గ్రామాల ప్రజలకు ,వాటి యొక్క ప్రతిఫలాలను అందేలా ,తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా మాస్టర్ ట్రేడర్స్ బ్లాక్ మాస్టర్ ట్రేనర్స్ లకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రతి అంశాన్ని ట్రైనింగ్ ద్వారా తెలపడం జరిగింది ఈ ట్రైనింగ్లో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్టర్ ట్రైనర్స్ సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆర్.బాస్కర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎ.శ్రీకాంత్, సి.డి.పి.ఓ నిలోఫర్ అజ్మీ, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రావు, డాక్టర్ చటర్జీ, నాగరాజు, బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్, తదితరులు పాల్గొన్నారు.


