కాకతీయ, మహబూబాబాద్ టౌన్ : ఈనెల 22 నుండి ప్రారంభమయ్యే ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అధ్యక్షతన బుధవారంజిల్లా కలెక్టరేట్ లో లైన్ డిపార్ట్మెంట్లతో రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది అందులో మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అందులో పదో తరగతి కొరకు 96 మంది విద్యార్థులు 102మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు హాజరవుతారని ఈ రెండు పరీక్ష కేంద్రాలలో మొత్తంగా 198 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
పరీక్షా సెంటర్లలో 144 సెక్షన్ విధించబడుతుందని సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లో మూసివేయాలని, ప్రతి సెంటర్లో మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. అలాగే పరీక్షలు ప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఎట్టి పరిస్థితుల అనుమతించరని పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించవలసిందిగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షల నిర్వహణ సజావుగా నిర్వహించాలని అన్నారు. సమావేశంలో మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతి రావు, జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, ఏ సి జి ఈ మందుల శ్రీరాములు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


