కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా లష్కర్ సింగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని, టిబి ముక్త్ భారత్ నిక్షయ్ మిత్రగా జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ సహకారంతో మహిళా టిబి పేషెంట్లకు ఒక్కొక్కరికి రూ.1000 విలువైన ప్రోటీన్ ఆహార కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. టిబి రోగులు మందులతో పాటు బలమైన పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని తెలిపారు. కలెక్టర్ స్నేహా శబరీష్ స్ఫూర్తితో జిల్లాలో మరింత మంది నిక్షయ్ మిత్రలుగా ముందుకు వచ్చి, టీబీ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాము లవ్వాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు, టిబి సూపర్వైజర్లు సతీష్ కుమార్, విజయ్ కుమార్, టిబి విభాగ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


