కాకతీయ ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని స్థానిక లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న మలిశెట్టి యశ్వంత్ ఉత్తమ లైన్మెన్ గా మహబూబాబాద్ సర్కిల్ ఎస్. ఈ విజేందర్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం జిల్లా కేంద్రంలో అవార్డును తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ విధులనుసక్రమంగా నిర్వర్తించడంలో ఎప్పుడు ముందుంటానని ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ లు హీరాలాల్, సునీతా దేవి, సీనియర్ అసిస్టెంట్ లింగన్న, విజయ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.


