epaper
Monday, March 2, 2026
epaper

భారతదేశాన్ని సూపర్ పవర్ గా మార్చడమే మోదీ లక్ష్యం.!!

కాకతీయ, వరంగల్ : భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందరమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇందులో భాగంగానే అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రైతుకు నష్టం కలిగించే పరికరాలను దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని వెల్లడించారు. దీంతో కక్ష కట్టిన అమెరికా ఇండియాపై ఎన్ని టారీఫ్ లు విధించినా భయపడకుండా రైతు క్షేమం కోసం పాటుపడుతున్నారని వివరించారు.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నేటి నుంచి గాంధీ జయంతి లాల్, బహుదూర్ శాస్త్రి జయంతి ఆయన అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవాపక్ష కార్యక్రమాలను జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్, కో కన్వీనర్లు కర్నే రవీందర్, కొంతం సంగీత్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు బుధవారం పలుచోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

రక్తదానానికి యువత ముందుకు రావడం ఆనందంగా ఉందని రవికుమార్ వెల్లడించారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటుతూ, దేశ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారని తెలిపారు. ఎప్పటికైనా ప్రపంచానికి విశ్వ గురువుగా భారత్ నిలవడం ఖాయమని, అది నరేంద్ర మోడీ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ రాష్ట్రంలో పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా కుంటి సాకులతో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.

ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అధిక సీట్లను బిజెపి గెలుచుకోవడం ఖాయమని గంట రవి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటని రవికుమార్ ధ్వజమెత్తారు. సర్కారు చేతగాని తనంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుంటే కళాశాలలను బంద్ చేస్తామని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నా డబ్బులు లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమేనని విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు నల్లబెల్లిలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సందర్శన బోధన...

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాక‌తీయ‌,వరంగల్: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించిన...

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల...

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img