కాకతీయ, మహబూబాబాద్ టౌన్: సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని, బుధవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లాలో యూరియా పంపిణీ (సరఫరా) లో నిమగ్నమై రైతులకు క్షేత్రస్థాయిలో వేగంగా పారదర్శకంగా సేవలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్,లను ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన పుర ప్రముఖులు, అధికారులు, విద్యార్థిని, విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ హరిప్రసాద్, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, హార్టికల్చర్ అధికారి మరియన్న, మైనారిటీ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు మదన్ గోపాల్, రాఘవరెడ్డి, అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


