కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఖిలా వరంగల్ మండలం లోని మామునూరు పోలీస్ క్యాంపులో బుధవారం రోజున సెప్టెంబర్ 17,1948, హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీన సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ ఎస్పీ జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ పూజ పోలీస్ క్యాంప్ సిబ్బంది, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ నాటి తెలంగాణ లో జరిగిన నైజం నిరంకుశత్వం, దేశ ముఖ్,పటేల్, పట్వారీ, వ్యవస్థల ద్వారా అణచివేత కు గురైన సందర్భంలో ఆర్యా సమాజం,సేవలు,కమ్యూనిస్టు సాయుధ పోరాటాలు,చాకలి ఐలమ్మ పోరాటం ,దొడ్డి కొమురయ్య పోరాట పటిమ,భూమి కోసం, భుక్తి కోసం,తెలంగాణ విముక్తి కోసం,ఆపరేషన్ పోలో,భారత మిలటరీ సైన్యం,నాటి హైదరాబాద్ 9వ నిజం లొంగుబాటు అనంతర కాలం తెలంగాణ భారత దేశంలో విలీన ప్రక్రియ పూర్తిగా సహాయాన్ని అందించిన నాటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవల గూర్చి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో, డిఎస్పీలు రమేష్, బిక్షపతి, వెంకటేశ్వర రావు, సోమాని, డాక్టర్ సుధీర్, ఆర్ ఐ శ్రీ చంద్రశేఖర్, మాధవి, సి సి రామాంజనేయ రెడ్డి, సుమన్, పి ఆర్ ఓ రామాచారి ఫోటోగ్రాఫర్ తాహిర్ అలీ, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


