వేడి ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలి
సీజనల్ వ్యాధులకు అవకాశం ఇవ్వద్దు…పరిశుభ్రత పిల్లలకు నేర్పాలి
జనగామ జిల్లా అదనపు కలెక్టర్పిం కేష్ కుమార్

కాకతీయ, జనగామ : జనగామ మండలం చౌడారం, ఉన్న తెలంగాణ ప్రభుత్వ బాలికల మోడల్ స్కూల్ లోని, వంటశాల ను, మరిగడి ప్రాథమిక వైద్య సబ్ సెంటర్ ను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు వేడిగా ఉన్న ఆహారపదార్ధాలను ఇవ్వాలన్నారు. అదేవిధంగా త్రాగేందుకు వేడిచేసి చల్లార్చిన నీటినే త్రాగునీరుగా ఇవ్వాలన్నారు. వంటశాల ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. వంటశాల కు చుట్టుపక్కల చెత్త చెదారం ఉండరాదన్నారు. బాలికలకు చేస్తున్న వైద్య పరీక్షల ను పరిశీలించారు. విద్యార్థులు అధైర్య పడరాదని చెప్పారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయరాదని, వైద్యుల ద్దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో సంపత్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, డాక్టర్లు, వైద్య సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు.


