కాకతీయ, నెల్లికుదురు: క్రీడల్లో రాణించిన వారికి విద్యా ఉద్యోగాలలో మెండుగా అవకాశాలు లభించి బంగారు భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి ఎ.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 14, 17 సంవత్సరాల విభాగాల్లో బాల బాలికలకు వేరువేరుగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రీడల్లో మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల విభాగం పోటీల్లో 36 మందిని, 17 సంవత్సరాలు విభాగాల్లో కబడ్డీ కోకో వాలీబాల్ పోటీల్లో మొత్తం 36 మందిని మండల స్థాయి నుంచి మొత్తం 72 మంది క్రీడాకారులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పీజీహెచ్ఎంలు ఎం రవి, వాణిశ్రీ, ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ సత్యనారాయణ, కేసముద్రం జోన్ సెక్రటరీ హిమాం, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సిహెచ్ ఐలయ్య, పీడీలు ప్రవీణ్, శ్రీనివాస్, వనిత, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొత్త నరసింహారెడ్డి, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.


