కాకతీయ, నర్సింహులపేట: నర్సింహులపేట హమాలీ సంఘం మండల అధ్యక్షుడిగా సూరబోయిన మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా రావుల యాకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హమాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న, సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉపేందర్, ముఖ్యఅతిథి గునిగంటి మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కమిటీని ఎన్నుకున్నారు.
అనంతరం అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ నర్సింహులపేట హమాలీ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యక్షుడిగా సూరబోయిన వీరన్న, సహాయ కార్యదర్శిగా కోడి సంపత్, కార్యవర్గ సభ్యులుగా ఉప్పలయ్య, రామచంద్రు, శ్రీను, మల్లయ్య,యాకయ్యలను ఎన్నుకున్నారు.


