epaper
Monday, March 2, 2026
epaper

Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్..అంగన్ వాడిల్లో 15,274 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మహిళా అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణల కారణంగా ఏర్పడిన మొత్తం 15,274 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నియామకాల ద్వారా చిన్నారులకు పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సంబంధిత సేవలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉంది.

ప్రస్తుతం అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులు లేకపోవడంతో పిల్లలకు సరైన పాఠాలు చెప్పడం, పోషకాహారం అందించడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల సహాయకులు లేని కారణంగా పిల్లలకు భోజనం వండడం, పంపిణీ చేయడం సమస్యగా మారగా, టీచర్లు లేని చోట పూర్వప్రాథమిక విద్య దాదాపు నిలిచిపోయింది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

అంగన్‌వాడీ నియామకాలలో ఏ మార్పులు అవసరమో తెలుసుకోవడానికి శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల విధానాలను పరిశీలించి నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి అర్హతతో పరీక్షలు నిర్వహించి, అదనంగా ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తున్నారు. కర్ణాటక లో 12వ తరగతి అర్హతతో పాటు కన్నడ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ECE, నర్సరీ లేదా NTT డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేరళ లో ICDS అధికారులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలను ఎంపిక చేస్తున్నారు. ఇక తమిళనాడు లో వర్కర్ పోస్టులకు ఇంటర్‌, హెల్పర్ పోస్టులకు పదో తరగతి అర్హత అవసరం ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ అర్హతతో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలించిన ప్రభుత్వం, మరింత పారదర్శకంగా, వేగంగా నియామకాలు జరిపేందుకు కొత్త మార్పులు తేవాలని యోచిస్తోంది. దీనిలో స్థానిక మహిళలకు ప్రాధాన్యం, మెరిట్ ఆధారంగా న్యాయమైన ఎంపిక వంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులు పూర్తయిన వెంటనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాలు జరిగితే రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు కొత్త ఊపిరి పీలుస్తాయి. చిన్నారులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంబంధిత సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img