కాకతీయ, బయ్యారం: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని మండలంలో బూతు స్థాయిలో బిజెపి పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎస్టి మోర్చా అధికార ప్రతినిధి భూక్య శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు.
మండల బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకుల, శక్తి కేంద్రాల ఇంచార్జిల సమావేశం మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఊకే రామ్మూర్తి, మంగమ్మ నాయకులు, రేఖా ఉప్పలయ్య, రామారావు, ఆకుల వెంకటేశ్వర్లు, రమేష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.


