హైదరాబాద్‌లో బలపడటానికి జూబ్లీహిల్స్ ఎన్నికను వినియోగించుకోవాలి
అభ్యర్థి ఎంపిక నిర్ణయం ఏఐసీసీ చూసుకుంటుంది
అభ్యర్థి ఎవరైనా గెలుపునకు అందరం కష్టపడుదాం
ఈ ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం
బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
సర్వేలు మనకు అనుకూలంగా వస్తున్నాయ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం సమీక్ష రేవంత్ రెడ్డి సమీక్ష
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతీ ఒక్కరూ పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. కాబట్టి ఈ ఉప ఎన్నికను కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యే ఫలితంగా చూడకుండా..భవిష్యత్‌లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపే అంశంగా గుర్తించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీలోని అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను ప్రజలకు కల్పించాలి. అభ్యర్థి ఎవరనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయిస్తుంఅని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా ఆయన సూచించారు.
ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి!
పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు సూచించారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని సైతం ప్రజల్లో కల్పించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయం కోసం పని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందన్నారు. మీ పని తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాను సమాచారం తీసుకుంటానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
సర్వేలు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయ్..!
ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు తెలిపారు. గతంలో చేయించిన సర్వేల్లో కంటే ప్రస్తుతం మనం చాలా మెరుగయ్యామని మంత్రులతో అన్నారు. సానుభూతి ఎజెండాగానే ఈ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందన్నారు. కానీ మనం మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందంటూ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో పుంజుకోవడానికి ఈ ఎన్నికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ నెలలోనే నోటిఫికేషన్..?!
సెప్టెంబర్ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈనేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల కార్యాచరణపై కసరత్తును ముమ్మరం చేశాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ అభ్యర్థి రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్‌లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్‌ను సీఎంకు అందినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానని అధిష్ఠానానికి చెప్పుకోవడంతో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంజన్‌కుమార్ యాదవ్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి ఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మ


