కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలో ఇటీవలే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) జిల్లా కార్యదర్శి జి. సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం 69 వ ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల నిర్వహణపై జిల్లాలోని పీడీలు పీటీలతో స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రెటరీలను ఎన్నుకోవడం జరిగినది. ఇందులో భాగంగా ఆదివారం జి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలుపుతూ.. నెల్లికుదురు జోన్ సెక్రటరీగా ఎండి ఇమామ్ జడ్పీ హెచ్ఎస్ ఆలేరు పిడిని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ పీడీలు సిహెచ్ ఐలయ్య, శంకర్, విజయ్ చందర్ శ్రీనివాస్, ప్రవీణ్, ప్రణయ్ మధు, పద్మ, లలిత, కొమురయ్య, పాల్గొని ఎండి ఇమామ్ కి అభినందనలు తెలిపారు.


