*పార్టీ నియమావళికి విరుద్ధంగా నూతన అధ్యక్షుడి నియామకం
*బిజెపి గీసుగొండ మండల శాఖలో అంతర్గత కుమ్ములాట
*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్రరావును కలిసిన మండల బిజెపి నాయకులు
కాకతీయ,గీసుగొండ: భారతీయ జనతా పార్టీ నియమావళి ప్రకారం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న చొక్కం శ్రీనివాసుని తొలగించి తమ ప్రమేయం లేకుండా వేరే వ్యక్తిని మండల అధ్యక్షుడిగా నియమించడంపై బీజేపీ మండల శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇదే విషయమై బిజెపి మండల నాయకులు ఆదివారం రోజున హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావును కలిసి అధ్యక్షుడి తొలగింపు అన్యాయమని వివరించి వినతి పత్రం అందజేశారు.
అనంతరం చొక్కం శ్రీనివాసుని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు సన్మానించి, తన నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ… పార్టీ నియమావళి ప్రకారమే మండల అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించగా చొక్కం శ్రీనివాసును ఎన్నుకోబడ్డారని ఆయనను తొలగించడం సంస్థగత న్యాయానికి విరుద్ధమని నిజాయితీగా పనిచేస్తున్న నాయకుల మనోధైర్యం దెబ్బతీసే పరిణామంగా వారు పేర్కొన్నారు.
ఏదైనా కారణాలతో అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే మండల నాయకులకు సమాచారం ఇచ్చి తొలగించాలని అదేవిధంగా మండలంలోని అన్ని బూత్ అధ్యక్షుల సమక్షంలో మరొకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. కానీ ఇలా చేయకుండా మా ప్రమేయం లేకుండానే నూతన అధ్యక్షుని ఎన్నుకోవడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుమ్మనిపల్లి శంకర్రావు, కోశాధికారి పొట్ర తిరుపతిరెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్,జిల్లా కౌన్సిల్ మెంబర్ జాన్ విక్రమ్,జిల్లా అధికార ప్రతినిధి సల్ల సాంబరాజు, మండల స్థానిక సంస్థ ఇంచార్జ్ బాలరాజు, ఆరకట్ల ప్రవీణ్,బూర్గుల యుగేందర్, కత్తి వెంకన్న, ఎంబడి రాజశేఖర్, ఆకుల వెంకన్న, ముల్క సత్యనారాయణ, కట్ల బిక్షపతి, పాత నాటి శ్రీకాంత్, గట్టిగా నాగరాజ్, నాయి కోటి మోహన్రావు, నాయి కోటి చాణుక్య, ప్రసుదా రెడ్డి, వెంకపురి కార్తీక్, కుమారస్వామి, సింగిరెడ్డి అనిల్, కన్నబోయిన నాగరాజ్, విజయ్, పసునూటి అనిల్, లాడే శ్రీధర్,ఆరకట్ల ప్రకాష్ తదితర నాయకులు పాల్గొన్నారు.


