యూరియా కోసం క్యూలో మాజీమంత్రి సత్యవతి
కాకతీయ, మహబూబాబాద్ : మాజీమంత్రి సత్యవతిరాథోడ్ యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులతో కలిసి మాజీమంత్రి సత్యవతి క్యూలో నిల్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు అష్టకష్టాలు పడుతున్నారంటూ విమర్శించారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. యూరియా వచ్చిందని, కొరత తీరిందని చెబుతున్న ప్రభుత్వానికి రైతుల వేదికల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చున్న దృశ్యాలు కనిపించడం లేదా అంటూ ఆమె రైతులతో అన్నారు. యూరియా కోసం మాజీమంత్రియే స్వయంగా క్యూలో నిల్చోవడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.


