కాకతీయ, నెల్లికుదురు: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు ఆదేశానుసారం మండల అధ్యక్షుడు చందు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని 17 సెప్టెంబర్ మొదలుకొని 15 రోజుల పాటు జాతీయ స్థాయిలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవా పక్షంలో స్వచ్ఛభారత్.
భారత దేశాన్ని డ్రగ్ ఫ్రీ దేశంగా, భారత దేశ యువకులను మత్తుపదార్ధలకు బానిస అవ్వకుండా, మాదకద్రవ్య రహిత దేశంగా రూపుదిద్దెందుకు చేసే ప్రయత్నంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా యువకులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించనుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సేవా పక్షం కన్వీనర్ చట్ల సంతోష్ కుమార్,కో కన్వీనర్లు బాదావత్ సురేష్, మహమ్మద్ ముస్తఫా జనరల్ సెక్రెటరీ రాస యాకిరెడ్డి, ఉపాధ్యక్షులు కుక్కల ఐలయ్య, వంగల రామచంద్రు మండల నాయకులు దుస్స యాకయ్య, గూగులోత్సుందర్, బూత్ అధ్యక్షులుతోటసురేష్, రొయ్యల చంటి, బొబ్బల కృష్ణ, జిల్లక యాకయ్య, తూమ్ శ్రీను, శ్రీపాల్రెడ్డి, జవహర్లాల్, మనోజ్, గోపగాని శీను పాల్గొన్నారు.


