కాకతీయ, గీసుగొండ: ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమైన ఘటన గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలో చోటుచేసుకుంది. సిఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామానికి చెందిన చిలువేరు వినీష్(23) చదువు మానేసి అతని తల్లితో కలిసి డైరీ ఫార్మ్ నడుపుతున్నాడు.
శుక్రవారం ఉదయం 7:30 ప్రాంతంలో మొబైల్ ఫోన్ ఇంటి దగ్గరే వదిలేసి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో యువకుడి తల్లి జయలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


