ఆత్మకూరు, కాకతీయ: గురువారం కురిసిన బారి వర్షానికి ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ పెద్ద చెరువు నిండి మత్తడి పొంగి ప్రవహిస్తుంది. దీంతో హనుమకొండ నుండి భూపాల పట్నం వెళ్లే వాహనదారులు జాతీయ రహదారి (163) పై గుంతలు ఎక్కువ ఉండడంతో కిలోమీటర్ పొడవునా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు మాట్లాడుతూ రోడ్డు పై గుంతలు ఎక్కువ ఉండడంతో వాహనాలు మత్తడి దాటాలంటే గంట సమయం పడుతుందని తెలిపారు. అదే సమయంలో మంత్రి సీతక్క ములుగు నుండి హైద్రాబాద్ వెళ్తున్న కాన్వాయ్ ఆ ట్రఫిక్ లో చిక్కుకుపోయారు. అనంతరం స్థానిక పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ తొలగించి మంత్రి వాహనాన్ని పంపించారు.


