కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరం లోని ఏనుమాముల మార్కెట్ లో ఉన్న రేషన్ బియ్యం నిల్వ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కేంద్రంలో నిల్వ ఉన్న బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు మరియు రికార్డు నిర్వహణను పరిశీలించారు.
ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథకం బియ్యం ఒకే ప్రాంతంలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పౌరసరఫరాల డిఎం, ఎం ఎల్ ఎస్ పాయింట్ ఇంచార్జికు శ్రీముఖాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ను ఆదేశించారు.
తనిఖీల్లో పట్టుబడ్డ బియ్యాన్ని వెంటనే వేలం వేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల్లో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.


