కాకతీయ, నెల్లికుదురు: కమ్యూనిస్టుల ఐక్యత కోసం సీతారాం ఏచూరి ఎంతో కృషి చేశారని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ కార్యదర్శి ఇసంపేల్లి సైదులు మాట్లాడుతూ ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా, కేంద్ర కమిటీ, పోలీట్బ్యూరో, రాజ్యసభ సభ్యులుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మధ్య తరగతి ప్రజల తరపున అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి అంతర్జాతీయ కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేసిన ఏచూరి ఆశయాలు కొనసాగించడానికి మనందరం పని చేయడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్ .మచ్చ వెంకన్న, ఐల్లెష్ నాగరాజు, వెంకన్న, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


