డిసెంబర్‌లో అవతార్ -3.. 160 భాషల్లోకి అనువాదం
కాకతీయ, సినిమా : హలీవుడ్ సంచలన సినిమా అవతార్ సిరిస్‌లో మూడో భాగం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అవతార్, అవతార్ 2లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దర్శకుడు జేమ్స్ కామోరూన్ అవతార్ -3ని తెరకెక్కించే పనిలో పడ్డారు.
![]()
మూడో భాగం ‘అవతార్ – ఫైర్ అండ్ యాష్’ నుంచి వరంగ్ పాత్ర ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈనెల 25న ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ‘అవతార్-3’ విడుదల కానుంది. కాగా, ‘అవతార్-4’ 2029లో, ‘అవతార్ -5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.


