కాకతీయ, బయ్యారం: భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన సిపి.రాధాకృష్ణన్ కు బీజేపీ పార్టీ బయ్యారం మండల కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సిపి రాధాకృష్ణన్ 1957 లో తమిళనాడులో జన్మించారు.16 ఏళ్ల వయసు నుంచే ఆర్ఎస్ఎస్, జన్ సంగ్లె సంఘాలలో పని చేస్తు 1998-99 సంవత్సరంలో కోయంబత్తూరు నుంచి బిజెపి పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు.
2004లో,2014,2019లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.2004-07 వరకు తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.2023లో జార్ఖండ్ గవర్నర్ గా ఎంపికయ్యారు. 2024 లో తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.2024 జులైలో మహారాష్ట్ర గవర్నర్ గా ఎన్నికయ్యారు.సిపి రాధాకృష్ణన్ కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ బీసీ సామాజిక వర్గానికి చెందిన సిపి రాధాకృష్ణన్ నీతి, నిజాయితీ, నిబద్ధతకు, మారుపేరు లాంటి వ్యక్తి అని గమనించి బిజెపి పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ ప్రకటించడం చాలా సంతోషకరం. ఎలాంటి సమస్యలైనా సామరస్యంగా, అలవోకుగా పరిష్కారం చేసే నైపుణ్యం ఉన్నవ్యక్తి గా పేరుపొందారని అన్నారు.
బిజెపి పార్టీ గుర్తించి ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిని ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి పై అత్యధిక ఓట్లతో సిపి రాధాకృష్ణన్ గెలవడం సంతోషకరమన్నారు.


