కాకతీయ, బయ్యారం: మండలం వెంకట్రాంపురం గ్రామపంచాయతీ జగన తండా కు చెందిన భూక్య పత్య నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం మండల కమిటీ విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మృతదేహంపై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు ఐలయ్య, మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు,గార్ల మండల కార్యదర్శి గుగులోత్ సక్రు లు పార్టీ ఎర్ర పతాకాన్ని కప్పివిప్లవ జోహార్లు అర్పించారు.
కుటుంబానికి బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.ఈ సంతాప కార్యక్రమంలో ఇస్లావత్ భీమ్లా, గుగులోతు నర్సింగ్,భుక్యబాసింగ్, పాల్తియా బద్రు,నిమ్మరమైన సహదేవ్,గుగులోతు మోహన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


