కాకతీయ, వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో నెలలు నిండకుండా జన్మించిన మగ మృత శిశువును తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన తొర్రూరులోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో 7 నెలల గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంలో అక్కడి వైద్యులు వరంగల్ సికేఏం కి తల్లిని, ఎంజీఎం ఆసుపత్రికి శిశువును రెఫర్ చేశారు.
అదేరోజు కుటుంబ సభ్యులు శిశువును ఎంజీఎం ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృత శిశువును తీసుకెళ్లకుండా ఎంజీఎం మార్చురీలోనే వదిలేసి వెళ్లినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని ఎంజీఎం ఆసుపత్రి అధికారులు మట్టెవాడ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు విచారణ చేపట్టి వారిది మామిడాల గ్రామం తొర్రూరు మండలం అని తెలువగా మృత శిశువు తల్లిదండ్రులు ఎల్లబ్ల అనిల్ కుమార్, హైమవతి లతో మాట్లాడి మృతశిశువును తీసుకెళ్ళమని చెప్పగా వారు నేడు అనగా శుక్రవారం వచ్చి తీసుకెళ్తున్నారని మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.


