మార్కెట్లకు ఊతమిచ్చిన అమెరికా-జపాన్ ట్రేడ్ డీల్
అమెరికా-జపాన్ దేశాల మధ్య కుదిరిన సరికొత్త వ్యాపార ఒప్పందాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చాయి. జపాన్‌తో ట్రేడ్ డీల్ ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా దేశీయ సూచీలపై పాజిటివ్ ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ల సూచికలు బుధవారం నిలకగా కొనసాగుతుండటం గమనార్హం. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముందుకు వెళ్తుండటంతో మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


