కాకతీయ, నర్సింహులపేట(మరిపెడ):మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం పురుషోత్తమగూడెం గ్రామంలో నూకల నరేష్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 23న ఘనంగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్. సురేందర్ రెడ్డి విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులు మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వవిప్,డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్రు నాయక్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ .. “నరేష్ రెడ్డి తన జీవితం మొత్తం ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు.
ఆయన పేరు ఎప్పటికీ స్మరణీయంగా ఉంటుందని, ఆయనను స్మరించుకుని ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తినిస్తుంది” అని తెలిపారు. కార్యక్రమంలో నూకల అనిరుద్ రెడ్డి, నూకల అభినవ్ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, జిల్లానాయకులు, మండల మాజీ సర్పంచులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


