కాకతీయ, లక్షెట్టిపేట: పేద ప్రజలకు న్యాయ సలహా అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటానని తెలంగాణ రాష్ట్ర మాజీ అడిషనల్ డైరెక్టర్ మాదంశెట్టి సురేందర్ అన్నారు. మాదంశెట్టి సురేందర్ ఇటీవల పదవి విరమణ పొందడంతో, ఆవోప ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆర్యవైశ్యులకే కాకుండా పేద ప్రజలకు న్యాయ సలహాలు అందించడంలో తనవంతు కృషి ఎప్పుడూ ఉంటుందని, గతంలో సైతం తెలంగాణ రాష్ట్రంలో బాధితులకు న్యాయం అందించడం కోసం కృషి చేసానన్నారు.
30 సంవత్సరాల క్రితం ఏపీపీగా ఉద్యోగం సంపాదించుకున్న తాను అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి సాధించానని,ఈ ఉన్నతిలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం:
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన గుండా రాజన్నను,మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన గాదె రామన్నను,ఇటీవల పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు అక్కినపల్లి రవీందర్,ఆర్టీసీ కంట్రోలర్ బొల్లం గంగాధర్ లను అవోప ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా ఆవోప లక్షెట్టిపేట అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించడంలో ఆర్యవైశ్య ఉద్యోగులు తమ శక్తి కొలది కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా జిల్లా అధ్యక్షుడు రాజమౌళి,లక్షెట్టిపేట యూనిట్ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షుడు,పాలకుర్తి సుదర్శన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాచర్ల సత్యనారాయణ,రాష్ట్ర కార్యదర్శి గుండా ప్రభాకర్,ఆవోప కార్యవర్గ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.


