ఉభయ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు..!

కాకతీయ, హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరదనీరు గోదారిలా పారుతోంది. ఇక కరువు తీరా వర్షం కురవడంతో పంట చేలల్లోనూ వర్షం నీరు కనిపిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణ నదులకు, వీటికి అనుసంధానమైన అనేక ఉప నదులకు వరద నీరు పోటెత్తుతోంది. ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగా అలర్ట్ అయింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు స్పష్టం చేసింది.


