కాకతీయ, గీసుగొండ: కొమ్మాల అంగడి రోడ్డు నిర్మాణ కోసం గ్రామ సభను పోలీసు బందోబస్తు నడుమ నిర్వహించగా, గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. మండలంలోని కొమ్మాల గ్రామపంచాయతీ పరిధి అంగడి రోడ్డు నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గత నెలలో శంకుస్థాపన చేశారు.
గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు పనులు పూర్తిచేయగా కొమ్మల గ్రామపంచాయతీ నుండి నిధుల కొరకై గతంలో రెండుసార్లు గ్రామసభ నిర్వహించగా గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలపలేదు. మళ్లీ ఇదే విషయంపై గురువారం పోలీసు బందోబస్తు నడుమ గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
అయితే కొమ్మాల అంగడి రోడ్డు నిర్మాణానికి తమ గ్రామపంచాయతీ నిధుల నుండి కేటాయించవద్దని కొండ వర్గీయులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టుపట్టగా, గ్రామపంచాయతీ నిధులనుండి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రేవూరి వర్గీయులు పట్టుబట్టడంతో గ్రామసభ రణరంగంలా మారింది. మెజారిటీ గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి అంగీకరించలేదు. దీంతో ఎంపీడీఓ పాక శ్రీనివాస్ గ్రామసభను వాయిదా వేసి గ్రామసభ నుండి వెళ్లిపోయారు.


