విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి
విద్యుత్ ప్రమాదాల పై జాగ్రత్తలు వహించాలి
కాకతీయ, ఇనుగుర్తి : విద్యుత్ ప్రమాదాల పై జాగ్రత్త వహించాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎం. ఐలయ్య అన్నారు. మండలంలోని ఆయా గ్రామలలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ పొలాల దగ్గర స్టార్టర్, మోటార్ లకు, ఇంటి దగ్గర కూడా ఎర్తింగ్ చేసుకోవాలని దుస్తువులు ఆరవేయడానికి ఐరన్ వైర్ వాడకూడదని చెప్పారు. కోర్కొండపల్లి, మహమూద్ పట్నం తావుర్య తండా లలో గ్రామంలోనీ రైతులకి ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా ఏఈ కి సూచనలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంలో చెట్లు విరిగి లైన్ ల మీద పడడం లేదా లైన్ తెగి కింద పడిపోయినప్పుడు వెంటనే రైతులు తమ లైన్మెన్ లేదా ఏఈ కి సమాచారం అందించాలని విద్యుత్ ప్రమాదాల సమయం లో విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇనుగుర్తి సెక్షన్ లో పనిచేస్తున్న ఇంజనీర్లకు, విద్యుత్ సిబ్బందికి విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ బి.శ్రీను, లైన్మెన్ యశ్వంత్, ఏ ఎల్ ఎం వేణు, కట్టర్ జామ్లా ఇతర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


