దొరికిన ఇసుక దొంగలు
7 ట్రాక్టర్లు స్వాధీనం
ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా
ఇసుకాసురుల ఆగని ఆగడాలు
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బడా మోసం
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొత్తూరు గ్రామ శివారు ఆకేరు వాగు నుండి మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఇసుక దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. తగిన సమాచారంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 7 టాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొంతమంది దుండగులు ఇష్టారాజ్యాంగ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని, పట్టుబడ్డ 7 ఇసుక ట్రాక్టర్లు,వాటి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.ఎస్సైతో పాటు ఎల్లయ్య, సంపత్,సుమన్,గణేష్,కానిస్టేబుల్ లు పాల్గొన్నారు


