నిందితులపై తక్షణమే చర్య తీసుకోవాలి
కాకతీయ, నల్లబెల్లి : జూనియర్ అసిస్టెంట్ వాంకుడోతు కల్పన ఆత్మహత్య యత్నానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ, స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని, అక్కడి అధికారులను అక్రమాలకు ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. గిరిజన ఉద్యోగి అయిన కల్పన ఆత్మహత్య యత్నంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం గర్హనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కల్పన తన సూసైడ్ నోట్‌లో లైంగిక వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం, నాయకుల ఒత్తిడిని స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఎమ్మార్వోకు కల్పన పలు మార్లు తన సమస్యలను తెలిపినా, స్పందించకపోవడం, పైగా కాంగ్రెస్ నాయకులతో రాజీ పడాలని చెప్పడం వల్లే ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించారని ఆరోపించారు. మైనింగ్, మట్టి మాఫియాలకు రెవెన్యూ అధికారుల మద్దతు, కాంగ్రెస్ నాయకుల దుర్వినియోగం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ సర్పంచ్ రాజారాం, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, గోనె యువరాజు, మామిండ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, జాటోత్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
నిందితులపై తక్షణమే చర్య తీసుకోవాలి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


