మావోకు ఘన నివాళి
కాకతీయ, బయ్యారం: మండలం కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో మావో 49వ వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడారు. మావో నాయకత్వంలో 1949లో రిపబ్లిక్ చైనా కమ్యూనిస్టు పార్టీని నిర్మించి, షాంకైషేక్,కుమింగ్ టాప్ భూస్వామ్యవాదులకు వ్యతిరేకంగా సన్ యెట్ సేన్ కూటమి ఏర్పాటు చేశారన్నారు. గెరిల్లా సైన్యం ద్వారా రెండు లక్షల సైన్యం, ఎర్రసైన్యంతో లాంగ్ మార్చ్ చేసి సామ్రాజ్యవాదుల నుండి దేశాన్ని విముక్తి గావించాడని ఆయన అన్నారు. కామ్రేడ్ మావో చైనాలో భూ పంపిణీ చేసి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేశారని, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచారన్నారు. కార్యక్రమంలో రామగిరి బిక్షం, తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, ఏపూరి వీరభద్రం, కొదమూరు నాగేశ్వరరావు, రమేష్, ఐలయ్య, శేషు, శంకర్, మురళి, సుధాకర్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
మావోకు ఘన నివాళి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


