డిస్నీల్యాండ్’ లో ఘనంగా కాళోజీ జయంతి
కాకతీయ, హనుమకొండ : ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి సందర్భంగా మంగళవారం డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, కరస్పాండెంట్ బాలుగు శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేష్ భాను, దినేష్ చందర్ కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. నిజాం పాలనలో నిరాదరణకు గురైన మన యాస, మన భాషలోనే తెలంగాణ ప్రజల జీవితం ఉందని, ఆ గోసనే కాళోజీ నా గొడవ అనే గ్రంథంలో వ్యక్తం చేశారని గుర్తు చేశారు. విద్యార్థులు తెలుగు భాషను గౌరవిస్తూనే ఇతర భాషల్లోనూ పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తిరుమలేష్, సారంగపాణి, భవాని, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.
డిస్నీల్యాండ్’ లో ఘనంగా కాళోజీ జయంతి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


