కాకతీయ, ఇనుగుర్తి: ఆలిండియా సివిల్ సర్వీస్ ఉద్యోగుల జిల్లా స్థాయి చదరంగం పోటీలలో మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రణయ్ విజేతగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రణయ్ సోమవారం మాట్లాడుతూ ఈనెల తొమ్మిది, పది తేదీలలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటున్నానని, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎంఈఓ రూపారాణి, సహచర ఉపాధ్యాయులు ప్రణయ్ను అభినందించారు.


