కాకతీయ, ఇనుగుర్తి: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని వ్యవసాయ సహకార సొసైటీ ద్వారా యూరియా పంపిణీని స్వయంగా పరిశీలిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా పంపిణీ జరగాలని, పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పేషెంట్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించి సీజనల్ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రిలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఎస్సై కరుణాకర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.


