కాకతీయ, పరకాల: పరకాల, నడికూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13న పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పరకాల సిఐ వి.క్రాంతికుమార్ ఒక ప్రకటలో తెలిపారు. గొడవలు వద్దు-రాజీలు ముద్దు, వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయని, ఒక వేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయని అన్నారు.
ఈ నెల13న కేసులు ఉన్నవారు వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా తొలగిపోతాయని సూచించారు. యాక్సిడెంట్, కొట్టుకున్న, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన, చిన్నచిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నేషనల్ లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని సూచించారు. దీనికోసం ఫిర్యాదు దారుడు, నేరస్తులు అందరూ తమ ఆధార్ కార్డు తీసుకుని పరకాల కోర్టు లేదా పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు.


