కాకతీయ, వరంగల్: నగరంలోని 35వ డివిజన్ మైసయ్యనగర్ లో పేద కుటుంబానికి చెందిన కొంగ అరుష్ అనే విద్యార్థికి వ్యాక్ ఫౌండేషన్ తరఫున రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారని ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ వన్నాల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుండి తమ ఫౌండేషన్ పలు సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటు పేదప్రజలకు అండగా ఉంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఐటీ, సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్, శివనగర్, కాశిబుగ్గ మండలం అధ్యక్షుడు ఎండీ రఫీ, అపురూప రజనీష్, శివనగర్ మండల ప్రధానకార్యదర్శి వైట్ల గణేష్, స్థానికులు పాల్గొన్నారు.


