కాకతీయ, నర్సంపేట: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని సోమవారం నర్సంపేట పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా కన్వీనర్ బానోతు శ్రవణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వారు చదువులకు దూరమవుతున్నారని అన్నారు.
పై తరగతులకు వెళ్లాలంటే వారి సర్టిఫికెట్ కళాశాల యజమాన్యాలు ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులు ఇబ్బందులు పడతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. వెంటనే విద్య రంగా సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంతోష్, సిద్దు, గణేష్, అభిలాష్, ప్రవీణ్, నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


