కాకతీయ, జగిత్యాల: జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీ ఆర్ బీ) లో సబ్ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న దత్తాద్రి ఇన్‌స్పెక్టర్ గా పదోన్నతి పోందారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కూమార్ ని అయన మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన దత్తాద్రిని ఎస్పీ అభినందించి పదోన్నతి చిహ్నంగా మరొక స్టార్ ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎస్పీ మాట్లడుతూ.. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా ప్రజా సంరక్షణ కోసం అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి పదోన్నతి ఒక గొప్ప గుర్తింపు అని, పదోన్నతి అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని ముఖ్యంగా పోలీస్ శాఖలో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించవలసి ఉంటుందని అన్నారు. పదోన్నతి ద్వారా ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించే విధంగా ముందుకు సాగాలని సూచించారు.


